విశాఖలో జగన్ కు చెక్ చెప్పేందుకు మంత్రి బాలరాజు యత్నాలు

సమావేశ అనంతరం శాసనసభ్యులు గానీ, బాలరాజుగానీ విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, మరో సీనియర్ నేత రామకృష్ణ జగన్ వర్గం వైపు మొగ్గుచూపుతున్న దృష్ట్యా మరికొందరు జగన్ వైపు వెళ్లేందుకు అవకాశం లేకుండా చర్చించుకున్నట్లు సమాచారం. జగన్ ఓదార్పుకు జిల్లా కాంగ్రెస్ నేతల నుండి ఎలాంటి సహకారాలు లేకుండా చూడాలని, తద్వారా ఓదార్పును విజయవంతం కాకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
విశాఖ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, ఎంపీ సబ్బం హరి తాను ఓదార్పులో పాల్గొంటానని, అధిష్టానం ఏమైనా ప్రశ్నిస్తే రాజీనామాకు సిద్ధం అని ప్రకటించడంతో ఓదార్పుపై మంత్రి బాలరాజు దృష్టి పెట్టారు. శాసనసభ్యులతో పాటు, రెండో క్యాడర్ కూడా జగన్ వైపు వెళ్లకుండా ఉండేందుకు అప్పుడే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రైతు సమస్యల పేరుతో కృష్ణా జిల్లాలో పేర్ని నానిని ఆకర్షించిన విషయం దృష్ట్యా ముఖ్యమంత్రి ఆయా జిల్లాల మంత్రులకు ముందు జాగ్రత్తలు చెబుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications