హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ వంద రోజుల ప్రణాళికకు రూ. 150 కోట్లు: కిరణ్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి చేయడమంటే నగరంలోని పేదలు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేయడమేనని ఆయన అన్నారు. నీటి సౌకర్యం, మినీ బస్సులు ఏర్పాటు, ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు, రేషన్‌కార్డులు, ఫించన్లు తదితర వాటిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం బోరబండ సైట్- 3లోని పెద్దమ్మనగర్‌లో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం వంద రోజుల కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందుకోసం 150 కోట్ట రూపాయల బడ్జెట్ కేటాయించామని అన్నారు. రోడ్లు, రూ. 10కోట్ల 70 లక్షలతో ఫుట్‌పాత్ పనులు, ఇక్కడ ఫ్లైఓవర్ కోసం రూ. 5కోట్లు, రూ. 10కోట్ల 60 లక్షలతో మంచినీటికోసం నిధులను కేటాయించినట్లు చెప్పారు.

హైదరాబాద్ మొత్తానికి విద్యుత్ అభివృద్ధి కోసం రూ. 160 కోట్లు, దీంతో హుస్సేన్ సాగర్ కూడా అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్న చిన్న ప్రాజెక్టుల మెరుగు కోసం రూ. 25కోట్లు, రూ. 30 కోట్లతో నగరంలోని కొత్త బస్సులు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వంద రోజుల్లో ఇప్పటికే 30 రోజుల పనులు పూర్తి అయ్యాయని, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయాలు కల్పించామని, ఇంకా 70 రోజులలో మిగతా పనులు అనుకున్న విధంగా అన్నిపనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు.

English summary
Chief Minister N Kiran Kumar Reddy announced Rs 150 crores for Hyderabad to implement 100 days programme. Hyderabad will be developed in such a way that poor to get fruits, he said. He participated in Rachabanda held at Borubanda of Hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X