చిరంజీవి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా?

వైయస్ జగన్ బాటలో నడిచే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు నుంచి వైదొలుగుతూ జగన్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆయన తన సొంత పార్టీపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే తరహాలో రాజీనామా చేసి చిరంజీవి కాంగ్రెసు టికెట్‌పై గెలవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, వైయస్ జగన్ వర్గం నాయకులకు ఆ రకంగా ఆయన జవాబు చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను, విలీన సభను చిరంజీవి వేదికగా మార్చుకునే అవకాశం ఉంది. తన రాజీనామా విషయాన్ని ఆ సభలో ప్రకటిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications