ముఖ్యమంత్రి కరుణానిధి కలైంజ్ఞర్ టీవీ చానెల్‌పై సిబిఐ దాడులు

ఈ సోదాల సమయంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, ఛానల్‌కు చెందిన ఉన్నతాధికారులను తమ అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు గంటల తరబడి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ కుంభకోణం కేసులో అరెస్టు చేసిన ఏ.రాజాను తీహార్ జైలుకు పంపించారు. అంతేకాకుండా, డీఎంకే చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి కుమార్తె, రాజ్యసభ ఎంపీ కనిమొళికి కూడా ఈ కుంభకోణంతో సంబంధంతో ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమె నడుపుతున్న ఒక స్వచ్చంధ సంస్థకు స్పెక్ట్రమ్ నిధులు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెను కూడా సీబీఐ విచారించ వచ్చనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications