హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వల్పంగా క్షీణించిన వైయస్ జగన్ ఆరోగ్యం, నాలుగో రోజుకు దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం దీక్ష చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆరోగ్యం సోమవారం స్వల్పంగా క్షీణించింది. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఫీజు పోరు దీక్ష సోమవారంనాటికి నాలుగో రోజుకు చేరుకుంది. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఈ నెల 18వ తేదీన ఆయన దీక్షను ప్రారంభించారు. సోమవారం ఉదయం భారీ వర్షం పడింది. ఈ సమయంలో ఆయన శిబిరం నుంచి వెళ్లి కారులో కూర్చున్నారు. వాన వెలిసిన తర్వాత తిరిగి శిబిరం చేరుకున్నారు.

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పరకాల ఎమ్యెల్యే కొండా సురేఖ హెచ్చరించారు. జగన్‌కు ఏమైనా హాని జరిగితే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సివుంటుందన్నారు.ఫీజు రీఎంబర్స్‌మెంట్ వ్యవహారాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఫిబ్రవరి 24 తేదీయే తుది గడువని ఆమె అన్నారు. దీక్షపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యువత తిరుగబడుతుందన్నారు. అసెంబ్లీకి 2 కిలోమీటర్ల దూరంలో పారా మిలిటరీ దళాలను నియమించడం ఎందుకన్నారు. ఇందిరాపార్క్ వద్ద యువనేత జగన్ చేపట్టిన దీక్ష శిబిరం వద్ద ఆమె ప్రసంగించారు.

English summary
YS Jagan's health is detoriarated today. He is dooing fast from past 4 days, demanding release of Fee 
 
 Reimbursement. Konda Surekha said that chalo assembly will taken up on 24th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X