వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్, 2జి స్కామ్‌పై జెపిసికి ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ‌: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటుకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం లోకసభలో ప్రకటన చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడికి ఆయన దిగొచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఘర్షణతో కాకుండా పరస్పర సహకారంతో ప్రజాస్వామ్యంలో పని చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలే పరిష్కార మార్గం చూపుతాయని ఆయన అన్నారు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై జెపిసి విచారణకు అంగీకరించినందుకు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రతిపక్ష విజయమో, అధికార పక్షం అపజయమో కాదని, ఇది ప్రజాస్వామ్య విజయమని ఆమె అన్నారు. జెపిసిని ప్రకటించినందుకు సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
PM Manmohan Singh announced today JPC on 2G spectrum scam. He said that Government is committed to curb corruption. Sushma Swaraj thanked pm for accepting JPC probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X