హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో నిర్వహింపజూస్తున్న రైల్‌రోకో కార్యక్రమం ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జరిగే రైల్‌రోకోను ప్రజలందరూ విజయవంతం చేయాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సోమవారం కోరారు. చితికిన తెలంగాణ బతుకుల వ్యథను న్యూఢిల్లీకి చూపించాలని అన్నారు. తెలంగాణ మిలియన్ మార్చ చూసి ప్రపంచం అబ్బురపడుతుందన్నారు. తెలంగాణకు చెందిన మంత్రుల కూడా రైల్‌రోకోను విజయవంతం చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజలంతా పట్టాలమీదకి రావాలని కోరారు. పట్టాలపైనే వంటా వార్పు చేయాలన్నారు. కాగా మార్చి పదవ తేదిన తలపెట్టిన మిలియన్ మార్చి అదే రోజు ఉంటుందని కోదండరామ్ స్పష్టం చేశారు. ఇంటర్ బోర్టు 10వ తేదిన జరిగే పరీక్షను వాయిదా వేసుకోవడానికి అనుమతించిందని చెప్పారు.
కాగా రైల్‌రోకో కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. తక్కువ దూరంగల రైళ్లను రద్దు చేయడంతో పాటు, ఎక్కువ దూరంగల రైళ్ల వేళల్లో మార్పులు చేస్తున్నట్టు చెప్పారు.కాగా రైల్‌రోకో సందర్భంగా ఎవరైనా రైళ్ల రాకపోకలను అడ్డుకుంటే ఊరుకునేది లేదని రాష్ట్ర డిజిపి అరవింద్ రావు స్పష్టం చేశారు. రైళ్ల వేగం పరిధి 50 కిలోమీటర్లకు తగ్గించాలన్నారు. రైళ్లను ఆపినా, ధ్వంసం చేసినా ఊరుకునేది లేదన్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు పెట్రోలింగ్ పెడతామని చెప్పారు.
Telangana Political JAC Chairman Kodandaram urged Telangana people to support to Rail Rokho which will organized on march 1st. He demanded Telangana ministers to participate. DGP warned they will arrest if trains will stop.
Story first published: Monday, February 28, 2011, 15:08 [IST]