పట్టు వీడని తెలంగాణ ఉద్యోగులు, సహాయ నిరాకరణ కొనసాగింపు

సహాయ నిరాకరణ యథాతథంగా కొనసాగుతుందని, వేతనాల కోసం వెనక్కి తగ్గేది లేదని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉద్యమంలోకి ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. సహాయ నిరాకరణ కింద చేపట్టే భవిష్యత్ కార్యాచరణపై ఉద్యోగ సంఘాల ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. వేతనాల కోసం ఉద్యోగులు పూచీకత్తుతో కూడిన లేఖ ఇవ్వాలనే ప్రతిపాదన తమ దృష్టికి రాలేదని, ఇలాంటి చర్యలను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యోగుల ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నిరసనలు మరింత ముమ్మరమవుతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications