రేప్ చేసి బెదిరింపు కాల్స్ చేస్తున్నాడు: మాజీ ప్రియుడిపై మోడల్ ఆరోపణ

చాలా సార్లు దీపేష్ పరేఖ్ తనను రేప్ చేశాడని, తనపై దౌర్జన్యం చేశాడని, 6.5 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే డబ్బులు, ఆభరణాలు ఎత్తుకెళ్లాడని ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని పట్టుకోవడానికి పోలీసులు రాజస్థాన్ వెళ్లారు. రాత్రుళ్లు అతను తనకు క్రమం తప్పకుండా ఫోన్లు చేస్తున్నాడని, గత రెండేళ్లుగా తనకు అతనితో సంబంధాలున్నాయని, తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడని ఆమె మిడ్ డే పత్రికకు చెప్పింది. అతను మాట నిలబెట్టుకోకుండా తన వస్తువులతో పారిపోయాడని ఆమె ఆరోపించింది.
షూటింగ్ సందర్భంగా తాము ప్రేమలో పడ్డామని, ఆ సమయంలో తాను గర్భంగా దాల్చానని, అబార్షన్ చేయించుకోవాలని సూచించాడని, అలాగే చేశానని, ఆలా మూడు సార్లు తాను గర్భం తీయించుకున్నానని ఆ మోడల్ చెప్పింది. షూటింగ్ సమయంలో దీపేష్ పరేఖ్ మరో మేల్ మోడల్‌తో కార్యకలాపాలు ప్రారంభించాడని, తాను వ్యతిరేకించడంతో తనను శారీరకంగా హింసించాడని ఆమె వివరించింది.












Click it and Unblock the Notifications