కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ జగన్ మనిషి: మాజీ మంత్రి జెసి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాటిల్ వేణుగోపాల్ రెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా మాజీ మంత్రి, అనంతపుర్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం అనుమానం వ్యక్తం చేశారు. అభ్యర్థి పాటిల్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారని కానీ టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గానీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి గానీ కృతజ్ఞతలు తెలియజేయలేదని అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను మెజారిటీ లేకుండా జిల్లా పరిషత్ ఎమ్మెల్సీలను గెలిపించుకున్నానని చెప్పారు.
ఇప్పుడు కూడా ఆ బాధ్యత మంత్రులపైనే ఉన్నదన్నారు. మా ఎంపీటీసీలంతా ఎన్నికల సమయంలో విహార యాత్రకు వెళుతున్నారని చెప్పారు. తమ అభ్యర్థులంతా ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ఆయన చెప్పారు.
Former Minister JC Diwakar Reddy said that Congress MLC candidate Patil Venugopal Reddy is Ex MP YS Jagan's candidate. He said that he thanked to Jagan but not to Congress and Sonia Gandhi.