వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రైవ్యాలీ విద్యార్థుల కోసం కృష్ణను కలిసిన టిడిపి, కాంగ్రెసు ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tri-Valley University
న్యూఢిల్లీ: ట్రైవ్యాలీ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్రమంద్రి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణను కలిశారు. ట్రైవ్యాలీ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం తొందరగా పరిష్కరించాలని కోరారు. వారి సమస్యలపై కేంద్రం అమెరికాకు ఓ బృందాన్ని పంపాలని కోరారు. విద్యార్థులకు పెట్టిన రేడియో ట్యాగ్‌లను వెంటనే తొలగించేందుకు, జైళ్లలో ఉన్న విద్యార్థులను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమస్యను అమెరికా ప్రధాని బరాక్ ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ దృష్టికి తీసుకు వెళ్లాలని వారు కోరారు. విద్యార్థులకు వీసా గడువు ముగిసి నందున, వీసా విషయంలో ఉన్న కఠిన నిబంధనలను పట్టించుకోకూడదని కోరారు. కాగా ఎస్ఎం కృష్ణ తమ అభ్యర్థనను సానుకూలంగా విన్నారని, అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఎస్.ఎం కృష్ణను కలిసిన వారిలో నామా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

English summary
State Congress and TDP MPs met foreign minister SM Krishna on Tri Vally issue today. They demanded to release students who are sentenced. Centre minister Jaipal Reddy said SM Krishna promised on students protection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X