కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన ఎమ్ఆర్‌పిఎస్ నేత మందకృష్ణ మాదిగ

కెసిఆర్ 11 మంది సభ్యులను కాపాడుకోలేకపోతున్నారని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎలా నెరవేరుస్తారని ఆయన అన్నారు. తెరాస సభ్యులు కాంగ్రెసుకు ఓటు వేయడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మే నెల వరకు వాయిదా వేయడం ద్వారా తెలంగాణకు కెసిఆర్ ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులను నమ్ముకుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే స్థితి లేదని, తెలంగాణకు కెసిఆరే ఆడ్డంకి అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications