'ఆపరేషన్ ఒడిస్సీ డాన్’లో ఎలాంటి మార్పులు ఉండవు: ఒబామా

ఈ ప్రాంగణంలోని ఆయన పాలనాభవనాన్ని సంకీర్ణ దళాలు నేలమట్టం చేయడం తెలిసిందే. మరోవైపు..ట్రిపోలీలోని సైనిక లక్ష్యాలపై పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలు బుధవారం కూడా దాడులు చేశాయి. రెబెల్స్‌కు, లిబియా సైనికులకు మధ్య బుధవారం పలు పట్టణాల్లో హోరాహోరీ ఘర్షణలు జరిగాయి. గడాఫీ పదవిలో కొనసాగినంత కాలం లిబియాపై జరుపుతున్న 'ఆపరేషన్ ఒడిస్సీ డాన్"లో ఎలాంటి మార్పులూ ఉండవని అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలిపారు.
లిబియాపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు జరుపుతున్న సైనిక దాడులు అన్యాయమైనవని గడాఫీ అరోపించారు. 'ఆ దాడులను త్వరలోనే తిప్పికొడతాం. మనపై ఫాసిస్టులు దాడి చేస్తున్నారు. భయం లేదు. నేనున్నా. నేనున్నా" అని ఆయన అభిమానులనుద్దేశించి చేసిన ఆవేశపూరిత ప్రసంగంలో అన్నారు. 'నేనిక్కడే, ఈ గడ్డపైనే ఉండి ప్రతిఘటిస్తా. ఈ చారిత్రక పోరాటంలో అవసరమైతే ప్రాణత్యాగం చేస్తా. లిబియన్లు తమ విశ్వసనీయతను చాటుకోడానికి రోడ్లపైకి రావాలి. దాడులకు భయపడొద్దు.
శత్రువులను వెంటాడి, వేటాడి నిర్బంధించాలి. అన్ని ఇస్లామిక్ సైన్యాలు నాతో చేతులు కలపాలి" అని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగాన్ని జాతీయ టీవీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. లిబియాలో నాటో దళాలు వైమానిక దాడులు జరపటాన్ని పార్లమెంటులో వామపక్షాలు, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. ఐరాస తీర్మానంపై సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications