వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాపై సత్యసాయిబాబా మేనల్లుడు శ్రవణ్ కుమార్ చిందులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: మీడియాపై భగవాన్ సత్యసాయిబాబా మేనల్లుడు శ్రవణ్ కుమార్ బుధవారం చిందులు వేశారు. మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తుందంటూ సీరియస్ అయ్యారు. సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్టులో వివాదాలు ఉన్నాయంటూ మీడియా అనవసర రాద్దాంతం చేస్తుందన్నారు. ట్రస్టులో ఎలాంటి విభేదాలు లేవన్నారు. బాబా ఆరోగ్యం బాగానే ఉందన్నారు. మీడియాకు విజువల్సు ఎందుకు విడుదల చేయడం లేదో డాక్టర్లనే అడగమని ఆయన చెప్పారు.

కాగా మీడియా ప్రతినిధులతో డాక్టర్లు సఫయా, రవిరాజ్‌లు మాట్లాడారు. బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ రవిరాజ్ చెప్పారు. బాబా ప్రస్తుతం పేస్ మేకర్‌పై ఉన్నారన్నారు. వెంటిలెటర్ల వల్ల బాబా ఊపిరితిత్తుల ద్వారా ఇతర అవయవాలకు నీరు చేరిందని అన్నారు. కొన్ని వారుల చికిత్సకు బాబా స్పందిస్తున్నారని అన్నారు. బాబాలో యూరిన్ అవుట్ తక్కువగా ఉందన్నారు. బాబా గుండె నిమిషానికి 80 సార్లు కొట్టుకుంటుందని చెప్పారు. సోడియం సాధారణ స్థితిలో ఉందన్నారు. బాబాకు పెట్టిన అన్ని వైద్య పరికరాలు ఇప్పుడు తొలగించే పరిస్థితి లేదన్నారు. అన్నీ ప్రస్తుతానికి ఉపయోగపడేవే అని చెప్పారు.

బాబా ఆరోగ్యం ఇప్పుడు బావుందని డాక్టర్ సఫయా అన్నారు. బాబా స్థాపించిన సత్యసాయి వైద్యశాలలో ఆయనే చేరుతారని ఊహించలేదని ఆవేదనతో చెప్పారు. బాబా ప్రస్తుతం బావున్నారని అన్నారు. బాబాకు అన్ని రకాల వైద్యసేవలు, పరీక్షలు నిర్వహించామని చెప్పారు. బిపి తగ్గి సామాన్య స్థితికి వస్తుందన్నారు. బెంగుళూరుకు చెందిన వైద్యులతే చికిత్స చేయిస్తున్నామని అన్నారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని అన్నారు. హైదరాబాద్ వైద్యులచే సిఆర్‌టి థెరపీ చేయిస్తున్నామని చెప్పారు. సిఆర్‌టి థెరపీ కొనసాగుతుందని చెప్పారు. బాబా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.

English summary
Bhagavan Satya Sai Baba son-in-law fired at Media today. He said Baba helath is normal. Doctors Safaya and Raviraj said about Baba's health in media conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X