అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరులో పాత్రధారులు ఎవరు?

కాషాయ వస్త్రధారి స్వామి అగ్నివేష్ ఛత్తీస్‌ఘడ్‌లోని శక్తిలో 1939 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించారు. ఆయన అసలు పేరు శ్యాం వేపారావు. కట్టు బానిసత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ద్వారా ఆయన విశేష ప్రజాదరణ పొందారు. ప్రపంచ ఆర్స సమాజ్ మండలిని స్థాపించారు. సమకాలీన బానిసత్వాంపై ఏర్పాటైన ఐక్య రాజ్య సమితి ట్రస్టు ఫండ్‌తో దానికి సంబంధం ఉంది. కోల్‌కత్తా సెయింట్ జేవియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన అగ్నివేష్ హర్యానాలోని హిందూ సంస్కరణ ఉద్యమంలో చేరారు. శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. అవినీతి వ్యతిరేక పోరులోకి ఆయన రావడం ద్వారా ప్రజా మద్దతు పెరిగింది.
అర్వింద్ కేజ్రివాల్ 1958లో జన్మించారు. ప్రభుత్వంలో పారదర్శకత కోసం ఆయన పోరాటం చేశారు. ఖరగ్‌పూర్‌లోని ఐఐటిలో చదివారు. ఆయనను ఆర్‌టిఐ లేదా సమాచార హక్కు వ్యక్తిగా పిలుస్తారు. ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా చేసే అవినీతి వ్యతిరేక పోరాటం చేసినందుకు ఆయనను 2006లో మెగసేసే అవార్డు లభించింది. అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరివర్తన్‌తో కలిసి ఆయన పనిచేస్తున్నారు.
కిరణ్ బేడీ 1949లో జన్మించారు. భారతదేశంలో అత్యున్నత మహిళా పోలీసు అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. ఢిల్లీలోని తీహార్ జైలులో చేపట్టిన సంస్కరణలతో కిరణ్ బేడీ వెలుగులోకి వచ్చారు. ఆమె తొలి మహిళా ఐపియస్ అధికారి. ఆమె 1072లో ఐపియస్‌గా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications