• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Mac OS X టాప్ పది మైక్రో అప్లికేషన్స్ గురించిన సమాచారం మీకోసం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews
Micro-Apps for Mac OS X
Mac OS X ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నటువంటి మీరంతా దానిలో ఉన్నటువంటి కొన్ని మైక్రో అప్లికేషన్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిదని, అలాంటి మైక్రో అప్లికేషన్స్ గురించిన సమాచారం మీకోసం ప్రత్యేకంగా... ఈ మైక్రో అప్లికేషన్స్ వల్ల మనకేంటి లాభం అని అనుకుంటున్నారా.. చాలా సింపుల్ అండి. కంప్యూటర్‌లో ఉన్నటువంటి ఇన్పర్మేషన్, సెట్టింగ్స్, టాస్క్‌లు దీని ద్వారా మీరు ఈజీగా యాక్సస్ చేయవచ్చు. ఇక్కడ మీకోసం Mac OS X ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్నటువంటి పది టాప్ మైక్రో అప్లికేషన్స్ గురించిన సమాధానం అందిస్తున్నాం...

Mac OS X:
10. Captur (క్యాప్చ్యూర్)

క్యాప్చ్యూర్‌ను ఉపయోగించి మీరు స్క్రీన్ షాట్స్‌ని మీ కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని గురించిన చూచికలను మీరు మెనుబార్‌లో చూడోచ్చు.
ఇది మాత్రమే కాకుండా మీకు కస్టమ్ సూచనలు ఇందులో ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీకు కావాల్సినటువంటి దానిని స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే దానిని మీకు కావాల్సినటువంటి ఫైల్ నేమ్‌తో సేవ్ చేసుకోవచ్చు.

9. Camouflage (కాము ప్లేజ్)

కాము ప్లేజ్ వల్ల మీ డెస్క టాప్ మీద ఉన్నటువంటి అన్నింటిని దాచిపెట్టడానికి దీనిని ఉపయోగిస్తాం. దీని వల్ల స్క్రీన్ క్యాస్ట్స్ చాలా శభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. ఇది మాత్రమే కాకుండా అన్నింటిని దాచేయడం వల్ల మీ డెస్క్ టాప్ క్లీన్‌గా ఉంటుంది. ఏది ఏమైనా గానీ కాము ప్లేజ్ వాడడం వల్ల మీ డెస్క్ టాప్ మీద ఏదీ లేదని మీరు ఫీల్ అవుతారు.

8. Clipboard History (క్లిప్‌బోర్డ్ హిస్టరీ)

క్లిప్‌బోర్డ్ హిస్టరీ అనేది చిన్న టూల్. దీనిని ఉపయోగించి కక్లిప్‌బోర్డ్ హిస్టరీని ఓయస్ మెనుబార్‌లో మీరు సేవ్ చేసుకోవచ్చు. కీ బోర్డ్ షాట్ కట్ ఉపయోగించి మీకు కావాల్సినటువంటి క్లిప్‌బోర్డ్ హిస్టరీని మీకు పదే పదే గుర్తు వచ్చే విధంగా ఇది చేస్తుంది.

7. QuietRead ( క్వైట్ రీడ్)

క్వైట్ రీడ్ ఓయస్‌తో పాటు మీ మోనుబార్‌లో సేవ్ అయి ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మీకు వచ్చినటువంటి URL'sను మీకు చూడడానికి టైం లేకపోతే ఇది దీని భద్రంగా దాచుతుంది. ఇది మాత్రమే కాకుండా మీకు కావాల్సినటువంటి అన్ని URL'sని సేవ్ చేసుకోవడానికి తగినటువంటి మొమొరి స్టోరేజి ఇందులో ఉంటుంది.

6. Apptivate (ఆప్టీటివేట్)

ఆప్టీటివేట్ అనేది మ్యాక్ ఓయస్‌లో ఉన్నటువంటి అధ్బుతమైన మైక్రో అప్లికేషన్. ఇది ఉపయోగించి కీబోర్ట్ షార్ట్ కట్స్ అన్ని ఈజీగా మీయొక్క కీబోర్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్స్‌ని మీ ఆపిల్ స్క్రిప్ట్స్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇది క్విక్ స్క్రిప్ట్ యాక్షన్స్‌కు సంబంధించిన వాటికి బాగా ఉపయోగపడుతుంది.

5. ScreenSharingMenulet ( స్క్రీన్ షేరింగ్ మెనులెట్)

మ్యాక్ ఓయస్ యక్స్ తో పాటుగా ఈ స్క్రీన్ షేరింగ్ మెనులెట్ వస్తుంది. దీని యొక్క పనితీరు చాలా అధ్బుతంగా ఉంటుంది. చాలా త్వరితగతిన స్క్రీన్స్‌కి ఇది కనెక్ట్ అవుతుంది. రీమోట్ నెట్ వర్క్ ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి కంప్యూటర్‌కి గనుక మీరు కనెక్ట్ అయినటువంటి సందర్బంలో ఇది అంత మంచి టాస్క్ కాదు అని అభిప్రాయం. లోకల్ మెనుబార్‌లో ఉన్నటువంటి అన్ని లోకల్ స్క్రీన్స్‌కి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్‌ని ఇది ఇట్చే తీర్చివేస్తుంది.

4. Snippets (స్నిప్పెట్స్)

స్నిప్పెట్స్ అనేది తక్కువ పరిమాణం కలిగిఉండి టెక్స్ట్ ఎక్పాపాన్షన్ అప్లికేషన్. ఇది మన మెనుబార్‌లో ఉంటుంది. ఏదైనా సింగిల్ విండోని ఎడిటింగ్ చేయడం కోసం దీనిని ఉపయోగించడం జరుగుతుంది.

3. CalendarBar (క్యాలండర్ బార్)

గూగుల్ క్యాలండర్, ఐ క్యాల్ మాదిరే ఇదీ రూపోందించడం జరిగింది. మెనుబార్ ద్వారా ఈ క్యాలెండర్ మీకు రోజువారీ ఈవెంట్స్‌ని మీకు గుర్తుచేస్తుంది. ఇది మాత్రమే కాకుండా మీకు సంబంధించినటువంటి ఈవెంట్స్ వేరు వేరు చోట్లు(ఫేస్ బుక్, గూగుల్ క్యాలెండర్) ఉన్నట్లైతే వాటన్నింటిని క్రోల్ ద్వారా సమ్మరైజ్ చేసి మీముందు ఉంచుతుంది.

2. Autograph (ఆటోగ్రాఫ్)

మ్యాక్ ఓయస్ యక్స్ లో ఉన్నటువంటి మరో అద్బుతమైనటువంటి అప్లికేషన్ ఆటోగ్రాఫ్. మీరు మీ స్నేహితులకు పంపేటటువంటి డాక్యుమెంట్‌కు గానీ, స్వంతంగా రాసినటువంటి హ్యాండ్ టెక్ట్స్‌కు గానీ ఇది గనుక మీకంప్యూటర్‌లో ఉంటే ఎటువంటి ఆటోగ్రాఫ్ అవసరం లేదు. ఇది ఓ పెన్ టాబ్లెట్ మాదిరి మీకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా మీరు మీచేతితో ఇందులో సంతకం చేయవచ్చు.

1. CloudApp (క్లౌవ్డ్ అప్లికేషన్)

క్లౌవ్డ్ అప్లికేషన్ చాలా సింపుల్. ఇది మెనుబార్‌లో దర్శనమిస్తుంది. మీరు ఎప్పుడైతే ఓ ఫైల్‌ని తీసుకోని దాని మీదకి డ్రాగ్ చేసినట్లైతే ఆటోమాటిక్‌గా క్లౌవ్డ్ అప్లికేషన్‌లోకి అప్‌లోడ్ అవుతుంది.

English summary
Tray and Mac OS X menu bar have become prime real estate for highly functional micro-applications that provide easy access to information, settings, and tasks. Here are our top ten favorites for both Windows and Mac.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X