వైయస్సార్‌పై అభిమానంతోనే వైయస్ జగన్‌తో ఉన్నా: కమలమ్మ

కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగానే తాను ఎన్నికల్లో గెలిచానని, కాంగ్రెసు పార్టీని తాను ఏనాడూ విమర్శించలేదని ఆమె చెప్పారు. కడప లోకసభ స్థానంలో తాను కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గత నాలుగైదు రోజులు కమలమ్మ వైయస్ జగన్‌తో ఉండాలా, కాంగ్రెసులో కొనసాగాలా అనే విషయాన్ని తేల్చుకోలేకపోయారు. వైయస్ జగన్‌తో చర్చలు విఫలం కావడంతో కాంగ్రెసులోనే కొనసాగాలని నిర్ణయించుకుని ముఖ్యమంత్రిని కలిశారు.












Click it and Unblock the Notifications