వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సురేష్ కల్మాడీని అరెస్టు చేసిన సిబిఐ, కామన్‌వెల్త్ క్రీడలపై విచారణ

తన మాజీ సహచరుడు సంజయ్ మహీంద్రూ విజ్ఞప్తి మేరకు 1.46 లక్షల రూపాయలను విడుదల చేయడానికి కల్మాడీ సంతకాలు చేసినట్లు సిబిఐ గుర్తించింది. క్వీన్స్ బాటన్ రిలేకు వీడియో స్క్రీన్స్, కార్ల సరఫరాకు కాంట్రాక్టు ఇచ్చిన విషయంో కూడా అక్రమాలు జరిగినట్లు సిబిఐ తెలుసుకుంది. హైదరాబాదుకు చెందిన ఎకెఆర్ కన్సట్రక్షన్ కల్మాడీ అనుబంధ కంపెనీగా భావిస్తున్నారు. ఎక్విప్‌మెంట్ కాంట్రాక్టు కోసం స్విస్ టైమింగ్ 13 కోట్ల రూపాయలను ఆ కంపెనీ ఖాతాలో జమ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ను అంగీకరించడంలో పలువురు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.