హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్మాడీ కామన్‌వెల్త్ స్కామ్: హైదరాబాదు ఎకెఆర్ ప్రతినిధి ప్రసాద్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Suresh Kalmadi
హైదరాబాద్: కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణంలో హైదరాబాదుకు చెందిన ఎకెఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ప్రసాద్ అనే వ్యక్తిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో కామన్‌వెల్త్ క్రీడల మాజీ నిర్వాహకుడు సురేష్ కల్మాడీ బినామీ సంస్థగా ఎకెఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీని భావిస్తున్నారు. సిబిఐ అదుపులోకి తీసుకున్న ప్రసాద్ కంపెనీ డైరెక్టర్ జనరల్‌గా భావిస్తున్నారు. నిజానికి ఎకెఆర్ కంపెనీ యజమాని ఎ కృష్ణా రెడ్డి అని చెబుతున్నారు. ఎ కృష్ణా రెడ్డి ఆచూకీ లభించడం లేదని సమాచారం.

కామన్‌వెల్త్ క్రీడల ఎక్విప్‌మెంట్ సరఫరా సబ్ కాంట్రాక్టు ఎకెఆర్ కంపెనీకి అప్పగించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి 13 కోట్ల రూపాయలు ఎకెఆర్ కంపెనీ ఖాతాలో జమ అయ్యాయి. అయితే, మూడు కోట్ల రూపాయల మేరకే ఎక్విప్‌మెంట్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. కల్మాడీని సిబిఐ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను మంగళవారం పాటియాలా ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు.

English summary
CBI arrested AKR construction director general Prasad in Commonwealth games scam. It is believed that AKR is Kalmadi's benami company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X