హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఎఎస్ అవతారమెత్తిన మాయలేడి, పిఎం సలహాదారునని మోసాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఐఎఎస్ అవతారమెత్తిన ఓ మాయలేడిని హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తాను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత సలహాదారునని చెప్పుకుంటూ సుమన్ సింగ్ అనే మహిళ ఎంతో మందిని బురిడీ కొట్టించింది. ఓ స్థలం విషయంలో సాయం చేస్తానని చెప్పి హైదరాబాదులోని టోలీచౌక్‌కు చెందిన మహ్మద్ ఖలీల్ అనే వ్యక్తి నుంచి ఆమె ఇటీవల పది లక్షల రూపాయలు వసూలు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

సుమన్ సింగ్ నలుగురు ఐఎఎస్, ఐపియస్ అధికారులను కూడా మోసం చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఆమె డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఆమెను ఐఎఎస్ అధికారిగా భావించి వారు డబ్బులు ఇచ్చారని సమాచారం. ఆ తర్వాత ఎఎఎస్ అధికారుల జాబితా చూస్తే వారికి ఏ పేరు ఎక్కడా కనిపించలేదని చెబుతున్నారు. పలువురు కాంగ్రెసు నాయకులను కూడా ఆమె మోసం చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి గత 12 ఏళ్లుగా ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
Hyderabad police arrest a woman for cheating, posing as IAS officer. Claiming as PM's personal assistant, she cheated even IAS and IPS officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X