హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డు ఆబిడ్స్‌లో శుక్రవారం పట్టపగలు బంగారం చోరీ జరిగింది. ఆబిడ్స్‌లోని పోలీసు స్టేషన్ సమీపంలో గల కైలాస్ జ్యువెల్లరీ ఉద్యోగి నుంచి దుండగులు బలవంతంగా రెండు కిలోల బంగారం ఎత్తుకెళ్లారు. బంగారంతో బైక్ మీద వెళ్తున్న దుకాణం ఉద్యోగిని వెంబడించి దుండగులు బంగారం దోచుకెళ్లారు. ఈ సంఘటన తీవ్ర సంచలన సృష్టించింది.
హాల్ మార్క్ చెకింగ్ సమయంలోనే ఈ దొంగతనం జరిగినట్లు కూడా చెబుతున్నారు. అయితే, బాధితుడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు బయటివారు ఇంత సాహసానికి ఒడిగడతారని ఎవరూ అనుకోవడం లేదు.