బాబాయితో అబ్బాయి: వైయస్ వివేకానందరెడ్డితో చేతులు కలిపిన జగన్

జగన్ కాంగ్రెసు పార్టీ వీడిన తర్వాత బాబాయ్, అబ్బాయ్‌లు కలుసున్నదీ అంతగా లేదనే చెప్పవచ్చు. అంతేకాదు గత డిసెంబర్‌లో క్రిస్మస్ పండగ సందర్భంగా ఇరు కుటుంబాలు కలిసి వేడుకలు నిర్వహించుకోలేదు. వారి కుటుంబంలో వేడుకలు విడివిడిగా నిర్వహించుకోవడం అదే మొదటి సారంట. ఆ తర్వాత ఓ పెళ్లిలో కూడా అటు ఇటుగానే ఉన్నారు. ఇటీవల ఉప ఎన్నికల ఓటింగ్ సమయంలో వైయస్ విజయమ్మ, వివేకానంద ఎదురు పడ్డారు. అప్పుడు కూడా పక్కనే ఉన్నప్పటికీ ఇరువురూ ఎవరో అన్నట్టుగా ఎవరికి వారే వెళ్లి పోయారు. అయితే గతంలో ఓసారి వివేకా హైదరాబాదులో జగన్ ఇంటికి స్వయంగా వెళ్లి కలిశారు. ఆ సమయంలో బయటకు వచ్చిన వివేకా జగన్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీసం కూడా మెలివేశారు.