మహానాడుకు జూ ఎన్టీఆర్ దూరం, విభేదాలే కారణమని అనుమానాలు

పెళ్లి కారణంగా తాను నెల రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉన్నానని, చిత్ర పరిశ్రమలో సమ్మె వల్ల కొన్ని రోజులు షూటింగు ఆగిపోయిందని, ఈ స్థితిలో నిర్మాతలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేక మహానాడుకు హాజరు కావడం లేదని జూనియర్ ఎన్టీఆర్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామని ఆయన అన్నారు. భౌతికంగా లేకపోయినా స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీర్వాదాలుంటాయని, స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడానికి నందమూరి కుటుంబం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మహానాడుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఫోన్ ద్వారా కోరారు. అయితే, సినిమా షూటింగులో బిజీగా ఉన్నానని, రాలేనని జూనియర్ ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించారు.












Click it and Unblock the Notifications