ప్రియుడిని చెట్టుకు కట్టేసి అతని ఎదుటే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

ప్రియురాలు విజయవాడకు చెందిన ఓ మాజీ శానససభ్యుడి అనుచరుడి బంధువు అని తెలుస్తోంది. దీంతో ఘటన వివాదంగా మారింది. తొలుత ముగ్గురు దుండగులు ప్రేమికులను చితకబాదారు. ఆ తర్వాత ప్రియురాలిపై అత్యాచార యత్నం చేశారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రియురాలిపై ఇద్దరు అత్యాచారం జరిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులున్నారు.
మాజీ శానససభ్యుడి అనుచరులు రెండు గ్రామాల్లో వెతికి ఇద్దరు నిందితులను కాళ్లూ చేతులు విరిగేలా కొట్టారు. గ్రామస్థులు వారిని అడ్డుకోబోయారు. కానీ వారు వినలేదు. మిగతా ముగ్గురిని అప్పగిస్తామని గ్రామస్తులు చెప్పారు. ఆ ముగ్గురి కోసం మాజీ శాసనసభ్యుడి అనుచరులు గాలిస్తున్నారు. ప్రేమికులిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. వారిద్దరు కలిసి విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఘాతుకం జరిగింది.












Click it and Unblock the Notifications