జైపాల్ రెడ్డిపై మండిపడుతున్న తెలంగాణవాదులు, ఇంటి ముందు ధర్నా

కాగా, జిల్లాల్లోనూ జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో జైపాల్ రెడ్డి ప్రకటనకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. మంత్రి పదవికి జైపాల్ రెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను తెలంగాణను ఉద్దేశించి ఆ మాటలు అనలేదని జైపాల్ రెడ్డి వివరణ ఇచ్చినా తెలంగాణవాదులు శాంతించడం లేదు.
సొంత కాంగ్రెసు పార్టీ నాయకుడు వి. హనుమంతరావు జైపాల్ రెడ్డిపై దుమ్మెత్తి పోశారు. జైపాల్ రెడ్డి ఆ విధమైన ప్రకటన చేయడం సరి కాదని ఆయన అన్నారు. ప్రజలు జైపాల్ రెడ్డిని హర్షించరని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు ఈ నెల 15వ తేదీన జైపాల్ రెడ్డి తమతో పాటు రావాలని ఆయన సూచించారు. తెలంగాణ కోసం జైపాల్ రెడ్డి నిలబడతారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని ఆయన అన్నారు.