రూ.10 కోట్లతో పట్టుబడ్డ ట్రస్టు సభ్యుడి డ్రైవర్: సంబంధం లేదన్న ట్రస్ట్

అనుమానస్పదంగా ఆ వ్యక్తి బెంగుళూరుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అతని పేరు శేఖర్‌గా తెలుస్తోంది. అతను సత్యసాయి ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ కారు డ్రైవర్. శేఖర్ వద్ద 10 కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అయితే శనివారం రాత్రి హరీశ్వర్ శెట్టి, ఆదివారం శేఖర్ డబ్బులు పట్టుకొని పోతూ పట్టుబడటం పట్ల ఇటు భక్తులలో, అటు పోలీసులలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అసలు ట్రస్టులో ఉన్న డబ్బెంత పోయిన డబ్బెంత అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా డబ్బు ఏమైనా పోయిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.