వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్యసాయి ట్రస్టు సభ్యులు డబ్బులు తరలిస్తున్నారు?: పుట్టపర్తిలో హడావుడి

దీంతో ట్రస్టు సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ట్రస్టు సభ్యులు నలుగురు ఆదివారం అకస్మాత్తుగా యజుర్ మందిరంలోకి వెళ్లారు. దీంతో అందరిలో మరింత అనుమానం బలపడిపోతోంది. యజుర్ మందిరంలోని డబ్బును గురు, శుక్రవారాల్లో లెక్కించిన విషయం తెలిసిందే. అయితే డబ్బును అంతా లెక్కించకుండా కొంత మాత్రమే లెక్కించి మిగిలిన డబ్బును చాటుగా తరలిస్తున్నట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పట్టుబడిన సూట్ కేసును మందిరం తెరిచిన రోజే ప్రశాంతి నిలయంలోని మరోచోటకు తరలించినట్లుగా తెలుస్తోంది.