నేనెరుగ, నేనెరుగ: తెలంగాణపై కిరణ్ కుమార్ రెడ్డి

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు - తెలంగాణపై తనకు తానుగా ఎలాంటి ప్రతిపాదనలూ అధిష్ఠానం వద్ద చేయడం లేదని ఎంపీలకు సీఎం చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని తదితరులను తాను శుక్రవారం కలుసుకున్నప్పుడు, తెలంగాణపై ఒక స్పష్టత ఏర్పడుతుందని సీఎం అన్నట్లు తెలిసింది. తెలంగాణపై అధిష్ఠానం ఏమనుకొంటోందో తనకు ఇప్పుడేమీ తెలియదని సీఎం చెప్పినట్లు సమాచారం. కిరణ్ మాటలను బట్టి తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం శుక్రవారం చర్చించనున్నట్లు వెల్లడవుతోంది.
కాగా, కాంగ్రెస్‌లోని సీమాంధ్ర ఎంపీలు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, సుబ్బరామిరెడ్డి కేంద్ర మంత్రులు పళ్లం రాజు, పురందేశ్వరి కూడా కిరణ్‌ను కలుసుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను డీఎస్, షబ్బీర్ అలీ, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, బలరాం నాయక్, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, మంత్రి శంకర్‌రావు కలిశారు.