హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామాతో వచ్చిన పిజెఆర్ తనయుడు విష్ణువర్ధన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishnuvardhan Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దివంగత నేత పిజెఆర్ తనయుడు, జూబ్లిహిల్స్ శాసనసభ్యుడు పి.విష్ణువర్దన్ డ్డి సోమవారం తన రాజీనామాతో అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలోని శాసనసభ్యులలో తాను ముందుగా రాజీనామా చేయడానికి ముందుకొచ్చానని చెప్పారు. గ్రేటర్ పరిధిలో సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నందున గ్రేటర్ శాసనసభ్యులు, మంత్రులు రాజీనామాలకు భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేద్దామని ఆయనకు సూచించారు. అయితే హైదరాబాదులో ఉన్న సెటిలర్స్‌కు గ్రేటర్ నేతలం హామీ ఇద్దామని చెప్పారు. సెటిలర్స్‌ ఆస్తులపై తాను హామీ ఇస్తూ రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు. తన రాజీనామే మొదట ఆమోదం పొందాలని ఆయన అన్నారు.

తన తండ్రి పిజెఆర్ తెలంగాణ కోసం, 610 జివో రద్దు కోసం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీపై అలుపెరగని పోరాటం చేశారని తాను కూడా తన తండ్రి బాటలోనే పయనిస్తానని అన్నారు. అవసరం వచ్చినప్పుడు రాజీనామాకు తాను సిద్ధమని పలుమార్లు ప్రకటించానని ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ కోసం సుమారు 600 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన గుర్తు చేశారు. కాగా సభాపతి ఫార్మట్‌లో విష్ణు రాజీనామా చేశారు. అయితే అందులో ఆయన సెటిలర్స్ రక్షణ కోసం కొన్ని కండిషన్స్ పెట్టారు. సెటిలర్స్‌ కోసం కండిషన్స్ పెడితే రాజీనామా ఆలస్యమవుతుందని ప్రశ్నించగా మరో రాజీనామాతో వస్తానని చెప్పారు.

English summary
Jubilee Hills MLA Vishnuvardhan come with resignation letter to Assembly today. He make some conditions in his letter for settlers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X