కాబూల్: అప్షనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సవతి సోదరుడిని కుటుంబానికి చెందిన అంగరక్షకుడే కాల్చి చంపినట్లు కర్జాయ్ కుటుంబ మిత్రులు మంగళవారం చెప్పారు. కర్జాయ్ సోదరుడు అహ్మద్ వలీ కర్జాయ్ కాందహార్ ప్రొవిన్సియల్ మండలి చైర్మన్‌గా ఉన్నారు. ప్రొవిన్స్‌లోనే కాకుండా దక్షిణ అప్షాన్‌లో అత్యంత శక్తివంతుడు. అన్న ఖయ్యూం మాజీ అంగరక్షకుడు సర్దార్ మొహమ్మద్ వలీ కర్జాయ్‌ని మంగళవారం కాల్చి చంపాడు.
తక్షణమే ఆ అంగరక్షుకుడిని చంపినట్లు వలీ కర్జాయ్ సన్నిహితులు చెప్పారు. గుర్తించడానికి అవకాశం ఉండకూడదనే అతన్ని చంపినట్లు చెబుతున్నారు. కాందహార్ అధికార చట్రమంతా కర్జాయ్ కుటుంబం చుట్టే ఉంటుంది.
The powerful half brother of the Afghan President Hamid Karzai was shot dead Tuesday by a family bodyguard, according to Karzai family friends who were nearby.