చెన్నై: నిత్యానంద స్వామితో రాసలీలల్లో తాను మునిగిపోయినట్లు వార్తలు ఇచ్చిన మీడియాపై తమిళ మీడియాపై తమిళ నటి రంజిత మండిపడుతున్నారు. మూడు మీడియా సంస్థలపై ఆమె పరువు నష్టం దావా వేశారు. నక్కీరన్, దినకరన్ పత్రిక, దినకరన్ వెబ్‌సైట్లపై ఆమె పరువు నష్టం దావా వేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు. నిత్యానంద స్వామితో తాను శృంగారం జరపలేదని, తాను శృంగారం జరిపినట్లు విడుదలైన టేపుల వ్యవహారంలో కుట్ర ఉందని ఆమె అన్నారు. నిత్యానంద స్వామితో తాను రాసలీలల్లో పాల్గొనలేదని ఆమె స్పష్టం చేశారు.
తనను సెక్స్ కుంభకోణంలో ఇరికించిన వ్యవహారంపై నిజాలను బయటపెడతానని ఆమె హెచ్చరించారు. తనపై తప్పుడు వార్తలు ఇచ్చిన వారిని వదిలిపెట్టబోనని ఆమె హెచ్చరించారు. నిత్యానంద స్వామితో రాసలీలలు నడిపిన అమ్మాయిని తాను మీడియా ముందుకు తెస్తానని, అన్ని విషయాలు బయటపెడతానని ఆమె అన్నారు.