హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం మధ్యవర్తిత్వం, టి-మంత్రులు వెనక్కి తగ్గుతారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామాలపై వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రాజీనామాలు చేసిన మంత్రులకు అధిష్టానం తరఫున మధ్యవర్తిత్వం వహించినట్లుగా తెలుస్తోంది. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రాంత మంత్రులను ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. అయితే వారు అందుకు ససేమీరా అనడంతో కనీసం అధిష్టానంతో మాట్లాడాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దానికి తెలంగాణ ప్రాంత మంత్రులు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ వైపు టి-కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఉద్యమ తీవ్రస్థాయికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటే మంత్రులు మాత్రం అధిష్టానంతో మాట్లాడటానికి మొగ్గు చూపడం విశేషం. మంత్రులతో ఓ గంట పాటు ముఖ్యమంత్రి మాట్లాడారు. వారి భేటీలో ముఖ్యంగా రాజీనామాల విషయం వచ్చినట్లు తెలుస్తోంది.

సబితారెడ్డి వంటి పలువురు మంత్రులు రాజీనామాకు అయిష్టంగానే అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇక నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సైతం రాజీనామాలు చేయలేదు. ఉద్యమ కార్యాచరణలో సైతం జానారెడ్డి, బస్వరాజు సారయ్య తదితర ఇద్దరు ముగ్గురు మంత్రులు మినహా ఎవరూ పాల్గొనడం లేదు. అయితే ఉద్యమాన్ని రూపొందిస్తున్న కెకె, జానారెడ్డి వంటి వారు మాత్రం మంత్రులంతా తమతోనే ఉన్నారని చెప్పుకొస్తున్నప్పటికీ మంత్రులు మాత్రం అధిష్టానంతో మాట్లాడడానికి మొగ్గు చూపడం గమనార్హం. తెలంగాణపై స్పష్టత వచ్చే వరకు తాము అధిష్టానంతో మాట్లాడేది లేదని కెకె వంటి వారు చెబుతుండగా మంత్రులు మాత్రం అందుకు విరుద్దంగా వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.

English summary
It seems, telangana ministers may step back on their resignations. Ministers met CM Kiran Kumar Reddy today. They were accepted for talk with high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X