హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవ్యాప్తంగా రైళ్లకు అడ్డుపడిన ఆందోళనకారులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Rail Roko
హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ కమిటీ ఇచ్చిన పిలువు మేరకు తెలంగాణవ్యాప్తంగా రైల్ రోకో జరుగుతోంది. గురువారం ఉదయమే ఆందోళనకారులు రైలు పట్టాల మీదికి చేరుకుని రైళ్లను ఆపేయడం ప్రారంభించారు. దీంతో పలు చోట్ల రైళ్లు ఆగిపోయాయియ రైల్‌రోకో కారణంగా 31 ఎక్స్‌ప్రెస్‌, 51 డీహెచ్‌ఎంయూ, 116 ప్యాసింజర్‌ రైళ్లను రద్దుచేసి 23 రైళ్ల వేళల్లో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే మార్పులు చేసింది. ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ మార్గంలో ఎంఎంటీఎస్‌ రైళ్లనుకూడా రద్దు చేశారు. అయినప్పటికీ పలుచోట్ల ఆందోళనకారులు రైళ్లను నిలిపేశారు.

వరంగల్‌ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ వాదులు రైల్‌రోకో నిర్వహించారు. లింక్‌, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లను తెలంగాణ నేతలు అడ్డుకున్నారు. వరంగల్‌ కాజీపేట స్టేషన్లో ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.

నల్గొండ రైల్వే స్టేషన్లో ఐకాస నాయకులు పట్టాలపై బైఠాయించారు. చిట్యాల రైల్వే స్టేషన్లో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన కార్యకర్తలను అరెస్టు చేశారు. వాడపల్లి విష్ణుపురంలో ఆందోళనకారులు రైలు పట్టాలపై బైఠాయించారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో రైల్‌రోకో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బిజెపి నేత దత్తాత్రేయను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరని దత్తాత్రేయ ఈ సందర్భంగా అన్నారు.

కరీంనగర్‌ జిల్లా జగిత్యాల- కాగజ్‌నగర్‌ ప్యాసింజర్‌ రైలును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. చర్లపల్లిలో నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణవాదులు నిలిపివేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గూడ్స్ రైలుతో పాటు పలు రైళ్లను ఆపేశారు.

English summary
In a response to call given by Telangana JAC trains were obstructed by agitators today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X