సోదరుడి మృత దేహాన్నిచూసి చలించిన ఆఫ్ఘన్ అద్యక్షుడు కర్జాయ్

ఇక హ్మద్ వాలి కర్జాయ్ ని ఆయనకు ఎంతో కాలంగా నమ్మిన బంటుగా తన కుటుంబ సభ్యులకు సెక్యూరిటీగా వున్న బాడీగార్డు హత్య చేశాడు. అహ్మద్ వాలి కర్జాయ్ దక్షిణ ఆఫ్గనిస్తాన్లో మంచి ప్రాబల్యం వున్నవాడు. ఈ హత్యతో కాంధహార్ ప్రాంతమంతా రాజులేని రాజ్యమై అట్టుడికిపోతోంది. కాంధహార్ ప్రాంతం అసలే తాలిబన్ల పుట్టినిల్లు కాగా ఇటీవల అమెరికా సైనికుల దాడులతో మరింత హింసాత్మకంగా తయారైంది. అహ్మద్ అలి కర్జాయ్ పై అనేక అవినీతి ఆరోపణలు వున్నాయి. మత్తు పదార్దాల వాణిజ్యంతో సంబంధాలున్నట్లుగా కూడా ఆరోపణలున్నాయి. హత్య చేసిన వెంటనే అతన్ని వాలి కర్జాయ్ బాడీ గార్డులు కాల్చి వేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications