హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెళ్లి నిరసన తెలిపి రావడమే: టి-ఉద్యోగుల నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhra
హైదరాబాద్: ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు శుక్రవారం నిర్ణయించుకున్నాయి. అయితే తమకు సానుకూలం పరిస్థితి కనిపించకుంటే చర్చలకు వెళ్లి అక్కడ తమ నిరసన తెలిపి బయటకు రావాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.శుక్రవారం ప్రభుత్వంతో జరిగే చర్చలకు వెళ్లాలా వద్దా అనే విషయంపై ఉద్యోగ సంఘాలు ఉదయం టిఎన్జీవో భవనంలో భేటీ అయి చర్చలకు వెళ్లి నిరసనలు తెలిపి రావాలని నిర్ణయించుకున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సైతం హాజరయ్యారు.

14ఎఫ్ రద్దుపైనా, ఎస్మా పైన ప్రభుత్వంతో గట్టిగా పట్టుపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఎస్మాపై తగ్గితే చర్చలు సాగించాలని లేదంటే నిరసన వ్యక్తం చేసి రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంత రాజకీయ ప్రజాప్రతినిధులు సైతం రాజీనామాలు చేయడంతో సరిపెట్టకుండా ఉద్యమంలో ముందుకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం.

English summary
Telangana employees ready to talk with government on 14F and ESMA. They decided to boycott talks if government not respond on 14F and ESMA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X