తెలంగాణ ఏర్పాటుకు 14ఎఫ్ నిర్ణయం సూచికనా?

Telangana Map
హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్ తొలగింపు నిర్ణయంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఎగిరి గంతేస్తున్నారు. దాన్ని ఓ గొప్ప విజయంగా వారు భావిస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు వరుస పెట్టి హర్షం వ్యక్తం చేశారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సూచికగా వారు భావిస్తున్నారు. 14ఎఫ్ తొలగింపు నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సూచికగా తెలంగాణకు చెందిన మంత్రి సారయ్య ఏకంగా బయటకే అనేశారు. 14ఎఫ్ తొలగింపు నిర్ణయాన్ని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా త్వరలోనే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల అభిష్టానికి అనుకూలంగానే 14ఎఫ్ తొలగింపు నిర్ణయాన్ని వెల్లడించిందని ఆయన అన్నారు.

14ఎఫ్ తొలగింపుపై అపోహలు వద్దని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. రేపు సమావేశమై తాము భవిష్యత్తు కార్యక్రమాన్ని ఖరారు చేసుకుంటామని ఆయన చెప్పారు. ఎల్లుండి కాంగ్రెసు నాయకులు తలపెట్టిన నిరసన దీక్ష రద్దయ్యే అవకాశం ఉంది. 14ఎఫ్ తొలగింపు నిర్ణయంలో చాలా జాప్యం జరిగిందని, ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉంటే బాగుండేదని కాంగ్రెసు మరో పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 14ఎఫ్ తొలగింపు నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాప్యం చేసిందని ఆయన న్యూఢిల్లీలో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+