తెలంగాణ అడ్డుకోవడానికే చంద్రబాబు టూర్: నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆ పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి బుధవారం ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి చిదంబరంతో చంద్రబాబు ఎందుకు భేటీ అయ్యారో ఆయనే స్వయంగా వెల్లడించాలని నాగం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నేతలకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.

14ఎఫ్ పేరా తొలగించాకే ఎస్సై పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. 14ఎఫ్ మాత్రమే తొలగించి చేతులు దులుపుకోవద్దని పేరు తొలగించాలన్నారు. 14ఎఫ్ రద్దు చేయడం కుదరదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారని మరి ఇప్పుడు ఎలా సాధ్యమైందని అన్నారు. ఎస్సై పరీక్షలకు కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. లెక్చరర్ల నోటిఫికేషన్ సైతం రద్దు చేసి ఆరో జోన్‌లో నియామకాలు జరపాలని అన్నారు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్న కాంగ్రెసు పార్టీ 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో పొత్తు ఎలా పెట్టుకున్నదని ప్రశ్నించారు. ఆగస్టు 15న మంత్రులు ఎవరూ వేడుకలకు వెళ్లవద్దని అన్నారు.

14ఎఫ్ రద్దు చేయకుండా ఎస్సై పరీక్షలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి పదవికే ముప్పు రావచ్చునని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బుధవారం సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. 14ఎఫ్ రద్దు చేయకుండా పరీక్షలు నిర్వహించినా అది న్యాయపరంగా చెల్లదన్నారు. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినందున దానికి పరీక్షలు నిర్వహించినా చట్టబద్దత ఉండదన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రల కంటే నక్సలైట్లే నయం అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+