మాయ ఇంటికి రూ. 20 కోట్ల ప్రభుత్వ వ్యయం

మాయావతి భవనం మరమ్మతులకు ముఖ్యమంత్రి కంటింజెన్సీ నిధుల నుంచి ఖర్చు పెట్టారు. ఆమె 2002 నుంచి తన ఇంటి కోసం 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు మంగళవారం శాసనసభలో ప్రతిపాదించిన అనుబంధ బడ్జెట్ తెలియజేస్తోంది. ఆమె ఇంటి మరమ్మతులకు 2002లో 19.53 కోట్లు కేటాయించారు. మళ్లీ 2007లో అధికారంలోకి వచ్చిన తర్వాత 10.09 కోట్లు మంజూరు చేశారు. నగరంలోని అత్యంత ప్రధానమైన ప్రదేశంలో గల మాయావతి ఇల్లు 2 లక్షల చ. అడుగుల విస్తీరణంలో ఉంది. దీని ప్రహారీగోడ నిర్మాణానికి 22 కోట్ల రూపాయల అవసరం ఏర్పడింది. తన ఇంటి ఆవరణలో కాన్షీరాం విగ్రహం పక్కనే తన 18 అడుగుల ఎత్తు విగ్రహాన్ని స్థాపించుకున్నారు.












Click it and Unblock the Notifications