ఆంధ్ర, తెలంగాణ సమస్య కాదు: 14ఎఫ్‌పై లగడపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ తొలగింపు ఆంధ్ర, తెలంగాణ సమస్య కాదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. 14ఎఫ్ తొలగింపు వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. అది ఆరో జోన్‌లోని ఆరు జిల్లాలకు, రాష్ట్రంలోని మిగతా 17 జిల్లాలకు మధ్య గల భేదాభిప్రాయమని ఆయన అన్నారు. హైదరాబాదులో పోలీసు శాఖలో ఉద్యోగాలు ఆరు జిల్లాలకు మాత్రమే దక్కుతాయని, దీనిపై ప్రాంతీయ భావోద్వేగాలు అవసరం లేదని ఆయన అన్నారు.

14ఎఫ్ తొలగింపుపై కోర్టుకు వెళ్లినా నిలబడదని ఆయన అన్నారు. దాన్ని మార్పు చేసే అవకాశం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు. మొత్తం 12 లక్షల ఎస్సై ఉద్యోగాల్లో ఒక లక్ష మాత్రమే హైదరాబాదుకు సంబంధించినవని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం కలిసి ఉండాలని సీమాంధ్ర ప్రజలు 90 శాతం మంది, తెలంగాణ విడిపోవాలని 50 శాతం మంది మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుతున్నారని ఓ సర్వేలో వెల్లడైందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 80 శాతం మంది రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+