తమిళులపై అమెరికా దౌత్యవేత్త జాత్యహంకార వ్యాఖ్యలు

ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో శుక్రవారం చేసిన ప్రసంగంలో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. దాంతో వెంటనే అమెరికా కాన్సులేట్ నష్టనివారణ చర్యలకు దిగింది. ప్రసంగం సందర్భంగా చావో అనవసరమైన వ్యాఖ్యలు చేశారని, ఆ దురదృష్టకరమైన వ్యాఖ్యలకు ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారని, ఎవరినో బాధపెట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని కాన్సులేట్ వివరణ ఇచ్చింది. తాను భారతదేశంలో అధ్యయనం సందర్భంగా 23 ఏళ్ల క్రితం పొందిన అనుభవాన్ని చావో సానుకూల దృక్పథంతోనే మాట్లాడారని స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరి క్లింటన్ ఇటీవల భారత పర్యటనలో చేసిన ప్రకటనను గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications