'అజహర్ తనయుడి ఆరోగ్యం ఆందోళనకరం'

సమాచారం అందుకున్న అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్ కుటుంబం వెంటనే అపోలో హాస్పిటల్ చేరుకుంది. లండన్‌లో ఉన్న అజారుద్దీన్ విషయం తెలియగానే హుటాహుటినా హైదరాబాద్ బయలు దేరారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో అయాజుద్దీన్ రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. అయాజ్‌కు ప్రతి ఆదివారం బైక్ రేసు చేయడం అలవాటు. నౌరీన్‌కు ఇద్దరు కుమారులు. అయాజ్ రెండో కుమారుడు. క్రికెట్‌లో అయాజ్ ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్నాడు. స్కూల్ క్రికెట్‌లో ఆయాజ్‌కు మంచి రికార్డుంది. అయాజ్ యూసఫ్ గూడ సెయింట్ మెరీస్ కళాశాలలో బికాం సెకండియర్ చదువుతున్నాడు.
అంతకుముందు అయాజుద్దీన్ మృతి చెందాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయాజుద్దీన్ ఆరోగ్యంపై విభిన్న కథనాలు రావడంతో ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడారు. అయాజుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. వెంటిలేషన్ పైన ఉన్నారన్నారు. అయాజుద్దీన్‌కు తల, చాతి, కడుపులో తీవ్ర గాయాలయ్యాయన్నారు. ప్రాణాపాయం నుండి కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications