హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీయా కాదా చెప్తా: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలంగాణకు చెందిన ఆయన వర్గం కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ మంగళవారం అన్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా ఆమె మంగళవారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జగన్ మౌనం తెలంగాణకు అంగీకారమే అన్నారు. ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించి రెండేళ్లవుతున్నా తెలంగాణ రాక పోవడానికి కారణం ఏమిటో ప్రజలు గుర్తించాలన్నారు. వరంగల్ జిల్లాలో వైయస్ విగ్రహం దాడి బాధాకరం అన్నారు.

సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ తన తల్లి ఆనారోగ్యం కారణంగానే తమతో పాటు రాజీనామా చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుది దొరల తెలంగాణ అజెండా అని విమర్శించారు. దొరలు వేదికపై ప్రసంగాలు చేస్తే తెలంగాణ రాదన్నారు. అందరి సహకారం తీసుకుంటేనే తెలంగాణ వస్తుందన్నారు. ఉప ఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయాలా వద్దా అనేది తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. గతంలో తెలంగాణ కోసం తాము ఢిల్లీ వెళ్లామని చెప్పారు. రాజ్యాంగ సంక్షేభంతోనే తెలంగాణ సాధ్యమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు సైతం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

సకల జనుల సమ్మెకు మద్దతుగానే రాజీనామా చేసినట్లు చెప్పారు. మా రాజీనామాలు ఏవిధంగా ఆమోదింప చేసుకోవాలా అని ఆలోచిస్తున్నామన్నారు. వైయస్‌కుతెలంగాణలోనూ అభిమానులున్నారని భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి అన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న దృష్ట్యా వారు బయటకు రాలేక పోతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ఏర్పడే వేదికపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

English summary
YSRC Party president YS Jaganmohan Reddy camp Congress MLA Konda Surekha said today that Jagan is not against to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X