హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సమ్మెకు కిరణ్ కుమార్ రెడ్డి విరుగుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ సకల జనుల సమ్మెకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విరుగుడు సూచించారు. సకల జనుల సమ్మెను దీటుగా ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సకల జనుల సమ్మెపై ఆయన సోమవారం ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్ష చేశారు. రహదారుల దిగ్బంధంలో భాగంగా జాతీయ రహదారులపై బైఠాయించిన తెలంగాణ ఆందోళనకారులను తప్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి కార్మికుల సమ్మె వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి విద్యుదుత్పత్తి ఆగిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి కూడా ఆయన చర్యలు సూచించారు.

ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే విషయంపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఆయన సూచించారు. బొగ్గు సరఫరా కోసం తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఆయన సూచించారు. ఆర్టీసి సిబ్బంది సమ్మె చేస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర నుంచి సిబ్బందిని రప్పించాలని, లేదంటే లారీ డ్రైవర్లతో బస్సులు నడిపించాలని ఆయన సూచించారు.

జిల్లాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రికి సరైన సమాచారం కూడా అందడం లేదు. సచివాలయ సిబ్బంది కూడా సమ్మె చేస్తుండడంతో జిల్లాల్లో పరిస్థితిపై నివేదికలు రూపొందించే వాతావరణం కూడా లేదు. ఆర్టీసి, సింగరేణి, ప్రభుత్వోద్యోగులు సమ్మె చేస్తుండడంతో పాలనా వ్యవహారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

English summary
CM Kiran Kumar Reddy ordered to make alternative arrangements to dace Telangana strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X