కోడి పిల్లను కూడా తెరాస నేతలు నరకలేరు: ఆనం

తెరాస చేస్తున్నది సకల జనుల సమ్మె కాదని, సకల జనులపై మర్దన అని ఆయన వ్యాఖ్యానించారు. సకల జనుల సమ్మె పేరిట రవాణాను అడ్డుకుంటున్నారని, మనమేమైనా చైనాలో ఉన్నామా, దేశ సరిహద్దు సమస్యనా అని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు చేస్తున్న సమ్మెను తెరాస నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన అడిగారు. తెరాస శాసనసభ్యులు కూడా తెరాస శాసనసభ్యులతో పాటు రాజీనామాలు చేశారని, వారు కూడా ఉద్యమం చేస్తున్నారని, కేవలం తెరాస రాజకీయ స్వార్థం కోసమే అలా చేస్తోందని ఆయన అన్నారు. తెలుగు మాట్లాడేవారిని నరుకుతారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications