బాన్సువాడ ఉప ఎన్నికపై చేతులెత్తేసిన చంద్రబాబు

బాన్సువాడలో అభ్యర్థిని నిలిపే విషయంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఈ ప్రాంతంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము ప్రతిపాదిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభకు ఎన్నకైన పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో బాన్సువాడ ఉప ఎన్నిక జరుగుతోంది. పోచారం శ్రీనివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస)లో చేరి ఆ పార్టీ తరఫున నామినేషన్ కూడా వేశారు. కాంగ్రెసు పార్టీ శ్రీనివాసగౌడ్‌ను పోటీకి దించింది. ఆయన కూడా నామినేషన్ వేశారు. ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.












Click it and Unblock the Notifications