కెసిఆర్‌పై విరుచుకుపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు

Errabelli Dayakar Rao
హైదరాబాద్: సకల జనుల సమ్మెకు మద్దతుగా తాము తెలంగాణ ప్రాంతాల్లో చేపట్టిన దీక్షలపై దాడులు చేయడంపై తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌కు కోదండరామ్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తమ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ పనిచేస్తున్నారని, అలా చేయడం కెసిఆర్ వల్ల కాదని, కెసిఆర్ తాత దిగి వచ్చినా అ పని చేయలేరని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

తెరాస, జెఎసి కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అలా చేస్తే సహించబోమని ఆయన అన్నారు. దమ్ముంటే కెసిఆర్ అల్లుడో కొడుకో కూతురో రావాలని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు వస్తే తామేమిటో చూపిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ముసుగులో కెసిఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. జెండాలు పక్కన పెట్టాలంటే కెసిఆర్ పెట్టడం లేదని, సకల జనుల సమ్మెకు మద్దతుగా తాము కార్యక్రమాలు చేపడితే మరో పక్క దాడులు చేయిస్తున్నారని ఆయన అన్నారు. గద్దర్, విమలక్క వంటి ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానించి సమావేశం నిర్వహించాలని, ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని, రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+