దీక్షపై కెసిఆర్ పట్టుదల, త్వరలో ప్రకటన: కెటిఆర్

బువ్వ కావాలి, పార్టీ కావాలి, పదవులు కావాలి, తెలంగాణ కావాలని తెలుగుదేశం, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారని, అది సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ బువ్వ కావాలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విసిరే ఎంగిలి మెతుకులు కావాలో వారు తేల్చుకోవాలని ఆయన అన్నారు. ప్రజల పక్షాన ఉంటారో, పార్టీల పక్షాన ఉంటారో తేల్చుకోవాలని ఆయన సవాల్ చేశారు. ఆంధ్రోళ్ల చంకన చేరి తాము కూడా తెలంగాణ కోసం పోరాడుతున్నామంటే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె అవూర్వంగా సాగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications