రెండు నెలల్లో తెలంగాణలో పర్యటిస్తా: చంద్రబాబు

రాజకీయాల్లో ఉన్నప్పుడు పూలూ రాళ్లూ పడుతాయని, రాళ్లే పడుతున్నాయని భయపడవద్దని ఆయన అన్నారు. తెలంగాణలో పార్టీ క్యాడర్ బలంగా ఉందని, నాయకులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గ్రామాల్లో పార్టీ సీనియర్ నాయకులు పర్యటించాలని ఆయన సూచించారు. రాజీనామాలు చేసిన తర్వాత కూడా తమపై దాడులు జరుగుతున్నాయని పార్టీ తెలంగాణ నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినప్పుడు చంద్రబాబు ఆ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications