మంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా నేడే

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: మంత్రి పదవికి తెలంగాణకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయనున్నారు. తెలంగాణ సాధన కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు గవర్నర్ నరసింహన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. సాధారణంగా తనకు రాజీనామా సమర్పించిన వెంటనే సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ లేఖను గవర్నర్ పంపుతారు. ఆ తర్వాత ఆ రాజీనామా ఆమోదం పొందడం మామూలే. శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు.

కోమటిరెడ్డి రాజీనామాపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. గాంధీ జయంతి 2వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించిన కోమటిరెడ్డి ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఒక రోజు దీక్ష, బహిరంగసభ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌పార్టీ తన వైఖరిని ప్రకటించనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగులు ఎటు పడుతాయోననే ఉత్కంఠ నెలకొని ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు సన్నిహితం కావడం వల్లనే తెలంగాణ సాకుతో రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+