రాజీనామాలపై శాసనసభ నాగం టీమ్ హల్‌చల్

స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించకపోవడాన్ని నాగం జనార్దన్ రెడ్డి తప్పు పట్టారు. రాజీనామాలు ఆమోదించకపోవడం తమ హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు. మొదటి సారి రాజీనామా చేసిన 101 మంది శాసనసభ్యులు వచ్చి రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదు వారి తాతముత్తాలదని సీమాంధ్ర నాయకులు అంటున్నారని, సీమాంధ్రకు రాజధాని కూడా లేదని, ఈ శాసనసభను వారు కట్టారా అని ఆయన అన్నారు. తెంలగాణపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఇదేనని, ఢిల్లీకి వెళ్లిన నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అంతకు ముందు అన్నారు.












Click it and Unblock the Notifications